జగన్‌కు షాకిచ్చేలా.. టీడీపీ ఎన్నికల ఆఫర్‌?

Chakravarthi Kalyan
ఎస్సీలకు జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన 27 పథకాలను అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని టీడీపీ బంపర్ ఆఫర్‌ ఇస్తోంది. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందనేది అవాస్తవమని, ఉన్న పథకాలను మరింత ప్రభావవంతంగా అమలు చేస్తామని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సంబంధించి.. మహానాడులో 15 తీర్మానాలను ప్రవేశపెడుతున్నామని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌ తమ మనుషులకు మాత్రమే వాటిని అమలు చేస్తూ.. అర్హులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ పథకాల అమల్లో లోటుపాట్లపై కచ్చితంగా సమీక్షిస్తామని.. అర్హులకు లబ్ధి కలిగేలా అమలు చేస్తామని.. తెలుగుదేశం అంటేనే సంక్షేమమని.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యం పోసిందే తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్‌ అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: