గాలి.. కర్ణాటకలో బీజేపీ కొంపముంచేశాడా?

Chakravarthi Kalyan
గాలి జనార్దన్ రెడ్డి గతంలో బీజేపీ లో చేరి సుష్మా స్మరాజ్ ఆధ్వర్యంలో కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు. గనులను లీజుకు తీసుకుని విపరీతంగా సంపాందించారు. ఏకంగా తాను వెళ్లే టాయిలెట్ రూం కూడా బంగారం పూత పూయించుకున్నాడనే విమర్శలు వచ్చాయి. కానీ గతంలో బీజేపీ కర్ణాటకలో నెగ్గడానికి కారణం గాలి జనార్దన్ రెడ్డి అని ఒక వైపు ప్రచారం జరిగింది. కానీ ఆయన  అవినీతి ఆరోపణపై సీబీఐ విచారణ తదనంతరం జైలు కెళ్లి రావడం, ప్రజల్లో వ్యతిరేకతతో బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ప్రస్తుతం కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి బీజేపీ ఓట్లను చీల్చగలిగాడు. గాలి జనార్దన్ రెడ్డికి పట్టున్న బళ్లారి ప్రాంతంలో 2 వేల ఓట్ల కు పైగా మెజార్టీ తో విజయం సాధించారు. భార్య అరుణ ఓడిపోయారు.  కేఆర్ పీపీ అనే పార్టీని పెట్టారు. 14 మంది అభ్యర్థులను నిలబెట్టారు. ఆ 14 మంది కూడా ఓడిపోయారు. ఆయన ఒక్కరే గెలిచారు. అయితే ఈ బళ్లారితో పాటు మిగతా 14 స్థానాలు మొత్తం బీజేపీ గతంలో గెలిచిన స్థానాలు.

అయితే గాలి అక్కడ ఓట్లను చీల్చడం ద్వారా ఆ 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. దీంతో కాంగ్రెస్ కు అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా గాలి పని చేసినట్లు తెలుస్తోంది. గాలి తన పార్టీ అభ్యర్థులు ఓడిపోయి బీజేపీ వాళ్లు కూడా ఓడేలా ప్రణాళిక రచించాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పద్నాలుగు స్థానాలు గనక బీజేపీకి వస్తే జేడీఎస్ కు మరో 10 స్థానాలు సాధించగలిగితే బీజేపీకి తిరుగు ఉండేది కాదు. కానీ 35 ఏళ్ల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ఏకపక్షంగా అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం నెలకొంది. బీజేపీ మాత్రం ఢీలా పడిపోయింది. బీజేపీ 65 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి రావడం అనేది పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: