హైదరాబాద్‌లో మోడల్‌ వైకుంఠ ధామం?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్న జీహెచ్‌ఎంసీ తాజాగా మోడల్ వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తోంది. సకల సౌకర్యాలతో శ్మశానాలను నిర్మిస్తోంది. తాజాగా బేగంపేట్ శ్యామ్ లాల్ బిల్డింగ్ వద్ద రూ. 8 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో వైకుంఠ ధామం నిర్మించారు. మహా పరినిర్యాణంగా పిలువబడే ఈ వైకుంఠ ధామాన్ని రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ శ్మశాన వాటికలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్ హాల్ ఉన్నాయి.

అలాగే బాడీ ప్లాట్‌ఫారమ్‌లు, ఫీచర్ గోడలు, ప్రవేశం, నిష్క్రమణకు తోరణాలు, ఫలహారశాల, నీటి వసతితో సహా టాయిలెట్ బ్లాక్‌ల ఏర్పాటు, పాత్ వేస్ అభివృద్ధి, పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి, వైఫై సౌకర్యం కల్పించారు. శివుని విగ్రహం ఏర్పాటు, రెండు అంతిమ యాత్రవాహనాల ఏర్పాటుతో పాటు సకల సౌకర్యాలు కల్పించామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: