హవ్వ.. బండి సంజయ్‌ ఫోటోకు దండలు?

Chakravarthi Kalyan
కేటీఆర్, టీఆర్‌ఎస్‌ ఫేస్‌బుక్‌ ఐడీ పేరు మీద బండి సంజయ్ ఫోటోకు దండవేసి ఒక సెలవంటూ పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది. గుండు సంజయ్‌...తెలంగాణల గంజాయి బ్రోకర్ మృతి అంటూ పోస్టు చేయడంతో బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పోస్టు చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కరీంనగర్ ప్రజలు పిచ్చోడిని గెలిపించారని కేటీఆర్ దొర అహంకారంతో మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి మండిపడ్డారు. కేటీఆర్ కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాణి రుద్రమదేవి డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రొఫైల్‌ భారాస పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌  అకౌంట్‌లో బండి సంజయ్‌ ఫోటో పెట్టి ఇక సెలవంటూ పోస్టు పెట్టారని రాణి రుద్రమదేవి విమర్శించారు. బండి సంజయ్‌ చనిపోయారని తప్పుడు పోస్టులు పెట్టారని.. ఈ విషయంలో కేటీఆర్‌కు సంబంధం లేకపోతే పోస్టు పెట్టిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదని రాణి రుద్రమదేవి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: