తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

Chakravarthi Kalyan
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి మూడోసారి అధికారం చేపడుతోందని... మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మనస్పర్థలను పక్కకు పెట్టి... ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గ హిమాయత్ నగర్ డివిజన్ లో క్యాడర్ తో లీడర్ పేరిట ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో... పార్టీ హైదరాబాద్ నగర ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరంలో మొదటగా అభివృద్ధి అయిన ప్రాంతం హిమాయత్ నగర్ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ లో అన్ని ప్రాంతాలకు , అన్ని వర్గాలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: