చంద్రబాబూ.. అప్పుడే పండుగ చేసుకోకు?

Chakravarthi Kalyan
రెండో మూడో ఎమ్మెల్సీలు గెలవగానే.. అధికారంలోకి వచ్చామని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో కంటే వైయ‌స్ఆర్‌ సీపీకి మరిన్ని స్థానాలు అధికంగా వస్తాయి తప్ప, ఎక్కడా సీట్లు తగ్గవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబులాగా సీఎం వైయ‌స్ జగన్ రైతులను, మహిళలను మోసం చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం జగన్ అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని..  వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలోనూ అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్‌ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని.. రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని.. మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని.. మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: