జగన్‌ సంగతి సరే.. మరి లోకేశ్‌ పుట్టిందెక్కడ?

Chakravarthi Kalyan
ఏపీలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ సీఎం జగన్ వైఖరిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా.. అవి లాజిక్ లేకుండా సాగుతున్నాయి. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన జగన్ కు వ్యవసాయం గురించి ఏమి తెలుసంటున్నారు నారా లోకేశ్‌.. తెలుసుకోవాలన్న, అవగాహన పెంచుకోవాలన్న తపన లేని వ్యక్తి జగన్ అంటున్న నారా లోకేశ్‌.. దుబారా ఖర్చులకు చేసే అప్పులకు మనం భరించాల్సి వస్తోందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు రైతులకు ఉరితాళ్లు కాబోతున్నాయని.. మోటార్లకు మీటర్లు పెడితే పగలకొట్టాలని నారా లోకేశ్‌ పిలుపు ఇస్తున్నారు.

కేసులుపెడితే మీ తరపున తెదేపా పోరాటం చేస్తుందని.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ప్రోత్సాహకాలు అందించారుని నారా లోకేశ్‌ గుర్తు చేసారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్దిచేశాయని.. నేను విన్నా, నేను చూశా అంటూ వచ్చిన వ్యక్తిని నమ్మి మోసపోయారా అని నారా లోకేశ్‌ అన్నారు. పాదయాత్రలో దారిపొడవునా చెరకు, మామిడి రైతులు గగ్గోలు పెట్టారని.. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారని నారా లోకేశ్‌ అంటున్నారు. జగన్ హైదరాబాద్‌ పుడితే.. మరి నారా లోకేశ్‌ ఎక్కడ పుట్టి పెరిగారని జనం ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: