కూల్చేస్తామన్న బండి సంజయ్‌పై సుమోటో యాక్షన్‌?

Chakravarthi Kalyan
ఇటీవల తెలంగాణలో కూల్చుడు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రగతి భవన్ పేల్చేయవచ్చని రేవంత్ రెడ్డి అంటే.. సచివాలయ గుమ్మటాలు కూలుస్తామని బండి సంజయ్ అంటున్నారు. అయితే.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సచివాలయం గుమ్మటాలను కూల్చి వేస్తామని చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర డీజీపీ సుమోటోగా తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు.

నూతన సచివాలయంపై ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని మంత్రి నిరంజన్ రెడ్డి  మండిపడుతుతన్నారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు తెలియకుండా అనాగరికంగా మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి  ఆరోపించారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం వారు వీరత్వంగా ధీరత్వంగా భావిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అందానికి చిహ్నంగా ఉన్న గుమ్మటాలను కూలగొడతానని, వాటిపై కూడా రాజకీయాలు చేయడం మంచిది కాదని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నాయకత్వం సమాధానం చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి  డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: