కేసీఆర్‌, కేటీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. మతలబు ఏంటి?

Chakravarthi Kalyan
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను అసెంబ్లీలో కలవడం సంచలనంగా మారింది. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌లకు వినతి పత్రాలు అందజేసినట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెబుతున్నా.. ఎన్నో అనుమనాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీ లోని అయన చాంబరులో కలిసి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్న జగ్గారెడ్డి... ప్రగతిభవన్లో మరొకసారి కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు.

మెట్రో రైలు సంగారెడ్డి జిల్లా సదాశివపేట వరకు విస్తరించాలని, దళిత బంధు తమ నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని.. కోరాడట. వెంటనే సీఎం కేసీఆర్ అక్కడ అందుబాటులో ఉన్న అధికారులను పిలిచి జగ్గారెడ్డి ఇచ్చిన వినతి పత్రంలోని సమస్యలను  పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారట. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను , మంత్రి కేటీఆర్ లను కలవడం లో తప్పేముందంటున్నారు జగ్గారెడ్డి. ఎంపీలు ప్రధానమంత్రి మోదీని కలిసినప్పుడు లేని తప్పు తాను నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ ను కలిస్తే తప్పు ఎలా అవుతుందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: