కార్పొరేట్‌ దోపిడీ ఆపరా.. సామాన్యులు బతికేదెలా?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో ఉన్న కార్పోరేటర్ విద్యాసంస్థలు దోచుకోవడమే మీకు ఇష్టమా అంటూ ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నించారు. కార్పోరేట్ విద్యాసంస్థల దోపిడిని అరికడుతారా లేదా అని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టిగా నిలదీశారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు కట్టించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిశ్రమ ఆర్థిక విధానాల ద్వారా దేశ సంపదను సృష్టించింది అసెంబ్లీలో భట్టి విక్రమార్క వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకుంటూ పోతే ఎలా భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
రాష్ట్ర అర్ధికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగాలేదని భట్టి విక్రమార్క అన్నారు. పేదలు సామాన్యుల ఆదాయం తగ్గుతుంటే కుబేరుల ఆస్తులు ఎలా పెరుగుతున్నాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కార్పోరేట్ అస్పత్రులు ఇష్టానుసారంగా బిల్లులు వేస్తున్నాయని...ఆస్పత్రులు దోపిడిని నియంత్రించే యంత్రాంగం ఉండాలని భట్టి విక్రమార్క సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: