రేవంత్‌ రెడ్డిపై పీడీ యాక్టు పెడతారా?.. డీజీపీ ఏం చేస్తారో?

Chakravarthi Kalyan
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు డీజీపీ ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చివేసిన తప్పులేదని మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు  కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో ప్రగతిభవన్‌ను పేల్చేయాలని వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శంబీపూర్ రాజు, ఎల్ రమణ, దండే విఠల్‌, ఎగ్గే మల్లేశంలు డీజీపీ అంజన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లోక్‌సభ స్పీకర్‌కు కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ములుగు జిల్లాలో అభివృద్ది పనులపై కూడా అయన తప్పుగా మాట్లాడారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు  మండిపడ్డారు. ములుగులో గిరిజన యూనివర్శిటీపై కూడా వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు  దుయ్యబట్టారు. వర్శిటీపై పార్లమెంట్‌లో మాట్లాడాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు  హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని.. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లను కాదని బ్లాక్ మెయిలర్‌ను పీసీసీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు  విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: