గుడ్‌న్యూస్‌: ఆ శాఖలో 1600 ఉద్యోగాలు?

Chakravarthi Kalyan
తెలంగాణలో ప్రస్తుత రబి సీజన్ లో.. రాబోవు ఎండాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకుంటున్న చర్యలపై విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్ కో & జెన్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్ రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి లతో మింట్ కాంపౌండ్ లోని మంత్రి కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహించారు. రబి సీజన్, ఎండాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.

రానున్న ఎండాకాలంలో  15,500 మెగావాట్లకు మించి గరిష్ట విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అలాగే tsspdcl లో 1601 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: