భాగ్యనగరంలో అబ్బుర పరిచిన మహా హారతి

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో మహా హరతి కార్యక్రమం అబ్బుర పరచించింది. వెలుగంతా మనమంతా ఒకటేననే భావనను కలిగించే మహత్తర కార్యక్రమంగా నిలిచింది. మనది వసుదైన కుటుంబమని పూర్వీకులు ఇచ్చిన పునాదులపై ఏర్పడిందని దాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపు ఇచ్చింది. హైదరాబాద్ పీపుల్స్‌ ప్లాజా నెక్లెస్‌ రోడ్ సాగర తీరాన నిర్వహిస్తున్న భారత మాత మహా హారత కార్యక్రమానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

దాదాపు మూడు వేల మంది బాలికలు భారత మాత వేషధారణలో ఈ కార్యక్రమంలో  అలరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. వివిధ రూపాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారత మాతకు హారతి ఇచ్చేందుకు ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఆరేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. భారత మాత ఫౌండేషన్ ద్వారా అతిథికి ఆహ్వానం సప్త హారతులు ఉంటాయి. కులం, మతం, వర్గం పేరుతో ఉండే శక్తులను దూరంగా పెట్టాలన్ని ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: