ఆ విషయంలో కళకళలాడుతున్న తెలంగాణ?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో అడవులు పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం అడవుల పునరుద్ధరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు వద్ద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇటీవల ఎకో టూరిజం ప్రాజెక్డులు ప్రారంభించారు. ఎకో టూరిజం కార్యక్రమాల్లో భాగంగా మన్ననూరు వద్ద ఎకో టూరిజం రిసార్ట్, 6 కాటేజీలు, 8 కొత్త సఫారీ వాహనాలు ప్రారంభించారు. పర్యాటకులు ఒక రోజు అమ్రాబాద్ లో గడిపేందుకు వీలుగా రూపొందించిన టైగర్ స్టే ప్యాకేజీ ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవడానికి పోర్టల్ ప్రారంభించారు.

తెలంగాణలో బాధ్యతాయుతమైన పర్యావరణహిత పర్యాటకం ప్రోత్సహించనున్నారు. అడవుల ప్రత్యేకత కాపాడుతూనే ఎకో టూరిజం అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రత్యేకించి అటవీ ప్రాంతాలు, పులుల అభరణ్యాల సమీపంలో మరిన్ని ప్రాజెక్టులు నెలకొల్పనున్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రకృతి, సహజ వనరులు, అడవులు పూర్తిగా సంరక్షించుకుంటే రేపటి మన మనుగడ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: