కేఎల్‌ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలు వచ్చేశాయ్‌?

Chakravarthi Kalyan
కె ఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి రెండో విడత ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేఎల్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది.  కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబందించి మెరిట్ విద్యార్థులను ప్రోత్సహంచేలా దేశ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను ప్రకటించారు.

ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ఇంటర్ మార్కులు, జె ఈ ఈ పరీక్షల్లో వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా తమ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులకు 10% నుంచి 100 శాతం  ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు వర్శిటీ ప్రకటించింది. విద్యార్థులకు ఫీజు రాయితీ కోసం ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల మేర ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని తెలిపింది. ఇంజనీరింగ్ కోర్సులతో పాటు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులను కూడా ప్రోత్సహించి వారికి అత్యుత్తమ విద్యను అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: