రేవంత్‌ రెడ్డి.. హౌస్‌ అరెస్ట్‌?

Chakravarthi Kalyan
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకుంది. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నా అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేసుకుంటే పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని టీపీసీసీ హెచ్చరించింది.

పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పక్షాన తాము ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి కోరామని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ముట్టడికో, రాస్తారోకో కోసమో అనుమతి అడగలేదని కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: