పేదలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా బియ్యం ?

Chakravarthi Kalyan
ప్రజా పంపణీ వ్యవస్థ ద్వారా  పంపిణీ చేసే బియ్యాన్ని జనవరి 1 తేదీ నుంచి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్డుల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని  సంవత్సరం పాటు ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఏపీ రాష్ట్ర పరిధిలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఇతర కార్డుదారులకు కూడా బియ్యాన్ని ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ షాపుల ద్వారా  పంపిణీ చేసే ఇతర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఏపీలోని రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల డీలర్లు, ఎం డి యు ఆపరేటర్లు, కార్డుదారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వినియోగదారులకు అవగాహన కల్పించాలని, ఉచిత బియ్యం పంపిణీ సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

అన్ని షాపుల్లో నోటీసు బోర్డును ప్రదర్శించాలని, ఉచిత బియ్యం పంపిణీపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఏపీఎస్ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (కంట్రోల్) ఆర్డర్ -2018 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించిన ఫిర్యాదులుంటే  కాల్ సెంటర్ 1967 , టోల్ ఫ్రీ నంబర్లు 18004250082 కు ఫోన్‌ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: