రాహుల్ గాంధీకి ఇలాంటి భార్య కావాలట?

Chakravarthi Kalyan
రాహుల్ గాంధీ.. దేశంలోనే ప్రఖ్యాత గాంధీల కుటుంబానికి ఏకైక వారసుడు. 50 ఏళ్ల వయసున్నా ఇంకా ఆయన పెళ్లే చేసుకోలేదు. అయితే.. తాజాగా ఆయన తనకు ఎలాంటి భార్య కావాలో మీడియాతో పంచుకున్నారు. మీకు ఎలాంటి భార్య కావాలని అడిగితే... నానమ్మ వంటి సుగుణాలున్న మహిళ అయితే నాకు అభ్యంతరం లేదన్నారు. అయితే.. అమ్మ, నానమ్మలో ఉన్న లక్షణాలు కలిసి ఉన్నమహిళ అయితే.. ఇంకా మంచిదని రాహుల్ గాంధీ అన్నారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూ నానమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
నానమ్మ అంటే తనకెంతో ప్రేమని.. ఆమె తనకు మరో మాతృమూర్తిలాంటి వారని రాహుల్ గాంధీ అన్నారు. ఇక వాహనాలపై తన అభిరుచులను బయటపెట్టిన రాహుల్‌.. కార్లపై అంతగా మోజు లేదని చెప్పారు. కార్లంటే పెద్దగా ఇష్టం లేదని.. తనకు సొంత కారు కూడా లేదని అన్నారు. ఇంట్లో సీఆర్‌-వీ ఉన్నా.. అది అమ్మ సోనియాదని చెప్పారు. కార్లంటే అంతగా ఆసక్తి లేకున్నా వాటికి వచ్చే రిపేర్లు మాత్రం 90శాతం రాహుల్‌కు తెలుసుట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: