డ్రగ్స్ టెస్ట్‌ కోసం రక్తం, కిడ్నీ ఇస్తానంటున్న కేటీఆర్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. గతంలో కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని.. దమ్ముంటే ఆయన రక్త పరీక్షలు చేయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్ పై చాలా ఆలస్యంగా కేటీఆర్ స్పందించారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ డ్రగ్స్‌ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాలు విసిరారు. డ్రగ్స్ పరీక్ష కోసం రక్తం ఇచ్చేందుకు సిద్ధమని  మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అవసరమైతే జుట్టు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానన్నారు. డ్రగ్స్‌ వాడినట్లు తేలకపోతే చెప్పు దెబ్బలు పడతావా అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కరీంనగర్‌ చౌరస్తాలో బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా? అని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. బండి సంజయ్ ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాను కరీంనగర్‌లోనే ఉంటానని పరీక్ష కోసం ఏ డాక్టర్‌ను తెచ్చుకుంటావో తెచ్చుకో అని  కేటీఆర్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: