రేపటి నుంచి పవన్ కల్యాణ్‌ కొత్త యాత్ర?

Chakravarthi Kalyan
రేపటి నుంచి పవన్ కల్యాణ్‌ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. జగన్ పాలనలో రైతులకు కనీస హక్కుగా రావాల్సిన మద్దత్తు ధర, ఎరువులు,బ్యాంక్ రుణాలు అందడం లేదని.. జగన్ పాలనలో కౌలు రైతులకు ఎటువంటి సహాయం అందని పరిస్థితి నెలకొందని జనసేన నేతలు అంటున్నారు. రాష్ట్రంలో సుమారు మూడువేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. జగన్ నియోజకవర్గం పులివెందులో 46మంది ఆత్మహత్య చేసుకోవటం దారుణమని.. అన్నపూర్ణ లాంటి ఉమ్మడి గుంటూరు జిల్లా లో కౌలు రైతులు 288మంది ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేతలు అంటున్నారు.

రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అతిపెద్ద  కుంభకోణమంటున్న నాదెండ్ల మనోహర్.. రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బు రైతులకు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవన్నారు. తెనాలి నియోజకవర్గంలో  7లక్ష 75వేల క్వింటాళ్లు వరి పండిస్తే  ప్రభుత్వం కేవలం 900క్వింటాళ్లు కొనుగోలు చేశారని.. రైతుల్ని కులాలు,మతాలు,ప్రాంతాలుగా,విడగొట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. గతంలో ధాన్యం కొన్న డబ్బులు ఇప్పటికి ఇవ్వని పరిస్థితి నెలకొందని.. నాదెండ్ల మనోహర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: