ఆ అవార్డుల్లో మరోసారి దేశంలోనే సిరిసిల్ల టాప్‌?

Chakravarthi Kalyan
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 అవార్డుల్లో మరోసారి సిరిసిల్ల టాప్ గా నిలిచింది. 4 స్టార్ కేటగిరీలతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు నవంబర్ నెలలో దేశంలోనే మొదటి స్థానం లభించింది. సర్వేక్షన్ అవార్డు దక్కడం పట్ల ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్థేశనంలో సిరిసిల్ల రాత మార్చే యజ్ఞంలో పనిచేస్తున్నవారందరికి ఈ అవార్డు అంకితమని కేటీఆర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో  అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. తాజా అవార్డులపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను కేటీఆర్ అభినందించారు. మీ నిరంతర మార్గదర్శనం, సహకారం వాళ్ళే సాధ్యమైoదంటూ కలెక్టర్ కేటీఆర్‌కు బదులిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: