బాబోయ్‌.. క్రెడిట్‌ కార్డు మోసం.. ఇలా కూడా చేస్తారా?

Chakravarthi Kalyan
సైబర్ నేరగాళ్లు ముదిరిపోతున్నారు. తాజాగా క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ పేరుతో సైబర్ మోసం వెలుగు చూసింది. హఫీజ్ పేట్ కు చెందిన బాధితుడు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేశాడు. క్రెడిట్ కార్డ్ డెలివరీ అయిన తర్వాత నకిలీ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ కోసం ఫోన్ చేసి మొబైల్‌కు సైబర్ నేరగాడు సందేశం పంపాడు. లింకు క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని కోరాడు.
అంతే.. బాధితుడు లింకు క్లిక్ చేసి వివరాలు నమోదు చేశాడు. వివరాలు సబ్‌మిట్ చేసినా అవ్వకపోవడంతో పలు మార్లు లింకును క్లిక్ చేయడంతో నేరగాడు ఆ ఫోన్ ను హ్యాక్ చేశాడు. విడతల వారీగా 8సార్లు 4.11లక్షల రూపాయలు కాజేశాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: