కాంగ్రెస్‌ ఎప్పుడూ సర్దార్ పటేల్‌ను అవమానించిందా?

Chakravarthi Kalyan
గుజరాత్ ఎన్నికల వేళ ఇప్పుడు రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ ప్రతి సందర్భంలోనూ సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ను అవమానించేందుకు ప్రయత్నించిందంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంబాత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ను కాంగ్రెస్ పొగడడం చూసి తనకు ఆశ్చర్యం వేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చిన్నప్పటి నుంచి పటేల్‌ను పొగిడిన కాంగ్రెస్ నాయకుడిని తాను చూడలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

కనీసం పటేల్‌ అంతిమ సంస్కారాలను కూడా సరిగా నిర్వహించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం ద్వారా పటేల్‌కు  ప్రధాని నరేంద్ర మోదీ ఘనమైన నివాళి అర్పించారని అమిత్ షా అన్నారు. ఇప్పటి వరకూ కేవాడియాలోని ఐక్యత విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు ఏ కాంగ్రెస్ నాయకుడు సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: