ప్రకాష్‌ రెడ్డికి.. పరిటాల సునీత వార్నింగ్?

Chakravarthi Kalyan
జాకీ పరిశ్రమ తరలిపోయిన విషయం ఇప్పుడు ఏపీలో రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే వల్లే పరిశ్రమ తరలిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పరిశ్రమలు తీసుకొస్తే, జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం తరలిపోతున్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఆమె రైతు కోసం తెలుగుదేశం పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ తీరును సునీత ఎండగట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంలో తాను వేసిన రోడ్లపై తిరుగుతున్నారని, తానిచ్చిన నీరు తాగుతున్నారని పరిటాల సునీత చెప్పారు.

చంద్రబాబు నాయుడు రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తే, ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పరిశ్రమ యాజమాన్యాన్ని 15 కోట్ల రూపాయలివ్వాలని బెదిరించారని పరిటాల సునీత  ఆరోపించారు. ఆరువేల మంది మహిళల ఉపాధికి గండికొట్టిన ప్రకాశ్ రెడ్డి, పరిశ్రమను తిరిగి తీసుకొచ్చి నీ తప్పును సరిదిద్దుకోవాలని  పరిటాల సునీత  చెప్పారు. రోజూ పరిటాల కుటుంబాన్ని తిట్టడం తప్ప, మూడున్నరేళ్లలో మీరు రాప్తాడు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని పరిటాల సునీత సవాల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: