ఏకంగా జగన్‌ పేరు చెప్పే మోసాలు?

Chakravarthi Kalyan
సీఎంఓ కార్యాలయం పేరు చెప్పి ఏకంగా ప్రభుత్వ అధికారుల నుంచి డబ్బులు లాగుతున్న ఇద్దరు ఘరానా మోసగాళ్లను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, కుంట్లూరు గ్రామానికి చెందిన సూర్య ప్రకాష్, ఆచారి ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వాధికారులని  టార్గెట్ చేశారు.  వారిని బెదిరిస్తే ఈజీగా డబ్బులు వస్తాయని భావించారు.
అధికారుల ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్ ద్వారా తీసుకొని తాము సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేవారు. ప్రభుత్వ కార్యాలయంలో ఖర్చుల కోసం అలాగే మీడియా వారికి భోజనాలు అంటూ డబ్బులు డిమాండ్ చేసేవారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు తీసుకునేవారు. తాజాగ అనంతపురం డిప్యూటీ రవాణా కమిషనర్ కు ఫోన్ చేసి బెదిరించారు. అయితే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకటో పట్టణ పోలీసులు వీరిని చాకచక్యంగా  పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: