ఆ వైసీపీ లీడర్‌ను టార్గెట్ చేసిన జనసేన?

Chakravarthi Kalyan
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును జనసేన టార్గెట్ చేసింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సీలింగ్ భూమి కబ్జా చేసి ఆక్వా సాగు చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తోట త్రిమూర్తులుపై పై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ఏకంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాజులూరు మండలం పల్లిపాలెంలో 35 ఎకరాల సీలింగ్ భూమిని తోట త్రిమూర్తులు ఆక్రమించి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని జనసేన నేతలు ఆరోపించారు.

ఆ భూమిలో ఆక్వా సాగు చేస్తున్నారని.. తనఖా పెట్టి బ్యాంకుల నుంచి 5 కోట్ల రూపాయలు రుణం పొందారని జనసేన నేతలు  చెప్పారు.  సీలింగ్ భూమి కబ్జాపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ భూమే అని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని జనసేన నేతలు తెలిపారు. భూ కబ్జాపై తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు లీలా కృష్ణ, పంతం నానాజీ, రాజబాబు కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: