యుద్ధానికి మళ్లీ సిద్ధమవుతున్న అమరావతి రైతులు?

Chakravarthi Kalyan
మహా పాదయాత్రను తాత్కాలికంగా ఆపిన అమరావతి రైతులు మరోసారి జగన్ సర్కారుపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. రెండో విడత మహాపాదయాత్ర పున:ప్రారంభంపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయించాయి. గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి, రాజ‌ధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు శివారెడ్డి, సుధాకర్, న్యాయవాది మాదల శ్రీనివాస్ సమావేశమయ్యారు.
మహాపాదయాత్ర నిలిచిన స్థలం యజమానిపై పోలీసు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని... సీసీ పుటేజిని సైతం పోలీసులు మాయం చేశారని శివారెడ్డి ఆరోపించారు. వీరిపై ప్రైవేటు కేసు వేస్తామని శివారెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఆటకాలు కల్పించినా అరసవల్లి వరకు మహా పాద యాత్ర సాగడం ఖాయమని శివారెడ్డి చెప్పారు. రాజధానిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ సుధాకర్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: