కొరియాల కుమ్ములాట.. మూడో ప్రపంచ యుద్ధమేనా?

Chakravarthi Kalyan
ప్రపంచమంతటా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఇజ్రాయిల్, పాలస్తీనా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.
సైనిక సరిహద్దుకు ఉత్తరాన ఉత్తర కొరియాకు చెందిన 180 యుద్ధ విమానాలు నాలుగు గంటలకుపైగా చక్కర్లు కొట్టినట్లు దక్షిణ కొరియా చెబుతోంది. అందుకే ఆ దేశం తమ యుద్ధ విమానాలను కూడా అప్రమత్తం చేసింది. మిలిటరీ డిమార్కేషన్ లైన్ కు ఉత్తరంగా 20 కిలోమీటర్ల వరకు విస్తరించిన వ్యూహాత్మక సరిహద్దు రేఖ వెంట ఉత్తర కొరియా యుద్ధ విమానాలు ఎగిరాయట. అందుకే ఆ దేశం F-35A స్టీల్త్  ఫైటర్ సహా 80 యుద్ధ విమానాలను రంగంలో దించింది. అంతేకాదు..  అమెరికాతో కలిసి 240 యుద్ధవిమానాలతో సైనిక విన్యాసాలు కొనసాగుతాయంటోంది. ఈ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: