ఆ జిల్లాకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన జగన్‌?

Chakravarthi Kalyan
శ్రీకాకుళం జిల్లాకు ఇది నిజంగా శుభవార్తే.. ఆ జిల్లాలోని  రెండు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహేంద్ర తనయ నది సమీపంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ రివైజ్డ్ ఎస్టిమేట్ కి అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా 24,600 ఎకరాలకు సాగునీరు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.852.44 కోట్లు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు.
ఇక వంశధార ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ఎత్తిపోతల పథకం నిర్మించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రాజెక్టు ద్వారా గొట్టా బ్యారేజీ కుడి కాలువ 2.4 వ కిలోమీటర్ దగ్గర పంప్ హౌస్ నిర్మించి రిజర్వాయర్ లో నీటిని ఎత్తిపోస్తారు. దీని కోసం రూ.176.35 కోట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు రెండు జీవోలను విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: