దమ్ముంటే: చంద్రబాబుకు కొడాలి నాని సవాల్?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు నిర్వహించాలన్న టీడీపీ డిమాండ్ పై ఆయన స్పందించారు. చంద్రబాబుకు దమ్ముంటే ముందు అసెంబ్లీకి రమ్మనమని సవాల్ విసురుతున్నారు. పనికిమాలిన యనమల రామకృష్ణుడు అంటున్నారని.. అసెంబ్లీ సమావేశాలు 20 రోజలు జరపాలంటున్నారని.. అందుకు మేము రెడీ... ఆయన చంద్రబాబుతో మాట్లాడి.. చంద్రబాబును అసెంబ్లీకి తీసుకు రమ్మనాలని అంటున్నారు. లేనిపోని ఆరోపణలు చేసి, వాకౌట్‌ చేయకుండా సభలో ఉండమనాలని సూచిస్తున్నారు.

చంద్రబాబు ఏడవొద్దని చెప్పాలని.. తాము అన్నీ చర్చిస్తామని కొడాలి నాని అంటున్నారు.  మీకు సభకు వచ్చే ధైర్యం లేదని... ఎంతసేపూ వాకౌట్‌ చేసి, బయట మాట్లాడడం తప్ప..  దిక్కు మాలిన ఎల్లో మీడియాలో చర్చలు పెట్టడం తప్ప.. ఇంకేమీ చేతకాదని కొడాలి నాని మండిపడ్డారు.    జగన్‌ పనై పోయిందని, మళ్లీ తాను సీఎం అవుతానని చంద్రబాబు అంటున్నారన్న కొడాలి నాని  ఏమిటి ఆయన అయ్యేది అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం ఎమ్మెల్యే కూడా కాడని.. ఓడిపోయిన లోకేష్‌ కూడా జగన్‌ పై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు కొడాలి నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: