హరీశ్ రావు ఛాలెంజ్‌.. నిర్మల పారిపోయారా?

Chakravarthi Kalyan
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పోరు ముదురుతోంది. ఈ పోరులో చివరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ షాపుల్లో మోడీ ఫోటో పెట్టలేదని రచ్చ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై స్పందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్ ను చూసి భాజపా వణికిపోతోందంటున్నారు. కేసీఆర్ రాష్ట్రం దాటి బయటకు వస్తే వైఫల్యాలు బయట పడతాయని భయపడుతోందని.. అందుకే కేంద్ర మంత్రులు గడికి ఒకరు తెలంగాణ వస్తున్నారని ఆయన అన్నారు.

నిర్మలా సీతారామన్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని.. రేషన్ షాపు లో నరేంద్ర మోదీ ఫోటో లేదని గొడవ పెట్టుకున్నారని.. ఆహార భద్రత చట్టం కింద కేంద్రం రాష్ట్రాలకు బియ్యం ఇవ్వడం ప్రజల హక్కు అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరలేదని నిర్మల అన్నారని.. కానీ తాము.. కేంద్రం ఒత్తిడి చేస్తే చేరామని.... దీని గురించి నిర్మలా సీతారామన్ కు అవగాహన లేదని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. హరీశ్ రావు ఛాలెంజ్ కు భయపడి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారన్న ప్రశాంత్ రెడ్డి.. ఆయుష్మాన్ కంటే మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో అమల్లో ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: