శ్రీలంకకు గుడ్ న్యూస్‌.. ఆదుకున్న ఐఎంఎఫ్‌?

Chakravarthi Kalyan
ఆర్థిక సంక్షోభంలో చిక్కి విలవిల్లాడుతున్న శ్రీలంకను ఆదుకునేందుకు ఐఎంఎఫ్‌ ముందుకొచ్చింది. శ్రీలంకకు నాలుగేళ్ల వ్యవధిలో 2.9 బిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ఐఎంఎఫ్‌ అంగీకరించింది. ఈ మేరకు ఓ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో శ్రీలంక సంక్షోభం నుంచి క్రమంగా కోలుకునే అవకాశం ఉంది. క్రమంగా శ్రీలంక గాడిన పడి వృద్ధి దిశగా వెళ్లేందుకు ఈ ప్రాథమిక ఒప్పందం తోడ్పడుతుందని ఐఎంఎఫ్ అంటోంది.

ఇటీవల శ్రీలంకకు వెళ్లిన ఐఎంఎఫ్‌ అధికారుల బృందం ప్రాథమిక ఒప్పందానికి సంబంధించిన వివరాలను అక్కడి మీడియాకు వెల్లడించింది. ఇప్పటికే శ్రీలంక అనేక దేశాలకు తీర్చాల్సిన రుణం ఎక్కువగా ఉంది. అప్పులిచ్చిన దేశాలు తీర్చాలని శ్రీలంకపై ఒత్తిడి చేస్తున్నాయి. అందుకే ఆయా దేశాలతో శ్రీలంక చర్చలు జరిపి.. తాము అందించే ఆర్థిక సాయంతో ఒడ్డునపడవచ్చని ఐఎంఎఫ్‌ సూచిస్తోంది. విదేశీ కరెన్సీ లేక శ్రీలంక కొన్నాళ్లుగా ఇంధనం, ఔషధం, వంటగ్యాస్ వంటి నిత్యావసరాలకు నెలల తరబడి తీవ్ర కొరత ఎదుర్కొంటోంది. మరి ఈ ఒప్పందం శ్రీలంకను ఏ మేరకు ఆదుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: