మీ గొడవే మీకా.. జనం గోడు పట్టదా.. మంత్రి బొత్స ఫైర్‌?

Chakravarthi Kalyan
సీపీఎస్‌ విధానంపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీ ఎస్ విధానం లో మార్పు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చర్చల సందర్భంగా స్పష్టం చేశారు. అయితే.. ఓపీఎస్ విధానంలోనూ కొంత మేర తగ్గడానికి ఉద్యోగులు అంగీకరించారన్నారు. అయితే చర్చల సందర్భంగా మంత్రి బొత్స ఉద్యోగులపై కొంత ఫైర్ అయినట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను మేర నెరవేర్చిందని.. నెరవేర్చని 5  శాతం హమీలల్లో సీపీ ఎస్ రద్దు అంశం ఒకటి అని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఎంతసేపూ మీ గొడవలే మీకు తప్ప.. ఇతర విషయాల గురించి కూడా కాస్త ఆలోచించండని మంత్రి బొత్స అన్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల తో పాటు 5 కోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని  బొత్స అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: