ఏపీకి గుడ్‌న్యూస్‌.. ఆ పథకానికి 1000 కోట్లు?

Chakravarthi Kalyan
ఏపీకి కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి 1000 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు డిపిఆర్లు సిద్ధం చేసి అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చామని   కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ తెలిపారు. ఇప్పటికే  39 లక్షల ట్యాప్ లు ఏర్పాటుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నట్టు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ  వెల్లడించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా, జల్ జీవన్ మిషన్ , కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల  చీఫ్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 రోజులపాటు నిర్వహించే కోవిడ్ ప్రికాషన్ డోస్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని రాజీవ్ గౌబ  స్పష్టం చేశారు.  గ్రామ పంచాయితీలు, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని రాజీవ్ గౌబ  సూచించారు.  ఆగస్టు 11 నుండి 17 వరకూ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టాలని రాజీవ్ గౌబ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: