ట్రంప్‌.. అన్నీ మూసుకుని కూర్చో: ఎలన్‌ మస్క్

Chakravarthi Kalyan
ట్రంప్‌.. అమెరికా మాజీ అధ్యక్షుడు.. అమెరికా అధక్షుడు జో బైడెన్‌ చేతిలో ఓడిపోయినా ఇంకా అమెరికా అధ్యక్ష పదవిపై మాత్రం ఆశ వీడలేదు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు. అయితే.. ఆయనపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సెటైర్లు పేలుస్తున్నారు. ట్రంప్ ఇక అన్నీ మూసుకుని క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగడం మంచిదని సలహా ఇస్తున్నారు. హాయిగా రిటైర్డ్ జీవితం గడపాలని మస్క్ సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బైడెన్ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్ వయస్సు 82ఏళ్లవుతుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన మస్క్.. అమెరికా సహా దేనికైనా సీఈవోగా వ్యవహరించడానికి ఆ వయసు చాలాఎక్కువ అంటూ కామెంట్ చేశారు. ట్రంప్ పై తనకు ఎలాంటి ద్వేషం లేదన్న మస్క్ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నిక రేసు నుంచి తప్పుకోవాలని మొదటిసారి సూచించారు. అయితే మస్క్ కామెంట్లపై ట్రంప్ స్పందించారు. మస్క్ గతంలో తనకే ఓటేసినట్లు ఓసారి తనతో చెప్పారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: