కరోనాపై WHO చీఫ్ సైంటిస్ట్ షాకింగ్‌ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారిని అర్థం చేసుకోవడం  అంత ఈజీ కాదట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్... అవును.. మూడేళ్ళుగా చూస్తున్నా.. ఈ కరోనా గురించి పూర్తిగా అర్థం కావడంలేదని డబ్ల్యూహెచ్‌ఓ  చీఫ్  సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్  అంటున్నారు.  వివిధ ప్రాంతాల్లో కొత్త వేవ్ లతో కరోనా ఎందుకు, ఎలా విరుచుకుపడుతుందో కూడా తెలియడం లేదంటున్నారామె. వీటికితోడు ఈ మహమ్మారితో దీర్ఘకాలంలో కనిపించే దుష్ర్పభావాలు  ఇంకా తెలియకపోవడం ఇంకా ఆందోళనకరమని  సౌమ్య స్వామినాథ్  పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్  వివిధ రకాలుగా ప్రవర్తిస్తోందని సౌమ్య స్వామినాథ్  తెలిపారు. అందుకే కొత్త వేవ్ ల విజృంభణను అర్థం చేసుకోలేకపోతున్నామని  సౌమ్య స్వామినాథ్  పేర్కొన్నారు. కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు ఒకే రకమైన టీకా రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ చీఫ్  సైంటిస్ట్ అంటున్నారు. ఇప్పటికే కొవిడ్ కు సంబంధించి భారీ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నందున వచ్చే రెండేళ్లలో ఇది సాధ్యం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: