సింగరేణి ప్రమాదం: ముగ్గురి మృతదేహాలు వెలికితీత?

Chakravarthi Kalyan
సింగరేణి గనుల్లో ఘరో ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి గనుల్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మరణించారు. అడ్రియాల్ లాంగ్వాల్ ప్రాజెక్టు గని ప్రమాదంలో మొన్న నలుగురు ఉద్యోగులు చిక్కుకుపోయారు. పైనుంచి బొగ్గు పెళ్లలను పడిపోవడంతో వారు గనిలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు రెండు రోజులుగా సహాయచర్యలు కొనసాగుతున్నాయి. వారిలో ఒక ఉద్యోగిని నిన్న సాయంత్రం సహాయక సిబ్బంది కాపాడగలిగారు.

కానీ మిగిలిన ముగ్గురు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, ఏరియా సేఫ్టీ మేనేజర్ జయరాజ్, మరో కార్మికుడు శ్రీకాంత్ ఉన్నారు. చైతన్య తేజ, జయరాజ్, శ్రీకాంత్ దేహాలను రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద వెలికి తీశారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: