వారెవా.. మేడారంలో ఉచిత వైఫై సౌకర్యం..?

Chakravarthi Kalyan
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైంది. భక్త జనం వెల్లువలా మేడారం వెళ్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. అయితే.. అడవి ప్రాంతం కావడం వల్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య ఉంటోంది. అందుకే భక్తుల కోసం మేడారంలో బిఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వైఫై సేవలను అందిస్తోంది. ఈ మేరకు బిఎస్‌ఎన్‌ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.శ్రీలత ఓ  ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రకటన ప్రకారం మేడారంలో ఫిబ్రవరి 20 వరకు ఉచిత వైఫై  సేవలు అందుబాటులో ఉంటాయి. జాతర పరిసరాల్లో 20 వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేశారు. సెల్‌ సిగ్నల్స్ కోసం 2జీ, 3జీ, 4జీలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. భక్తులు మొబైల్ ఫోన్‌లో వైఫైని ఆన్ చేసుకుని ఈ సౌకర్యం పొందొచ్చు. వైఫైలో QFI-BSNL-FREE-WIFI @ మేడారం అన్న వైఫైకు కనెక్ట్ అవ్వొచ్చు. భక్తులు తమ ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజర్‌ను తెరవాల్సి ఉంటుంది. కస్టమర్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, లాగిన్‌పై క్లిక్ చేయడం ద్వారా వైఫై పొందొచ్చు. నాలుగు అంకెల పిన్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత లాగిన్ పేజీలో బ్రౌజింగ్ ప్రారంభించు అనే ఆప్షన్‌ పై క్లిక్ చేయడం ద్వారా వైఫై పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: