ఆ 12 నియోజకవర్గాలు టార్గెట్ చేసిన బండి సంజయ్..?

Chakravarthi Kalyan
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఇప్పుడు వర్గాల వారీగా లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని నియోజక వర్గాలను సామాజిక వర్గాల వారీగా విభజించి.. ఒక్కో సామాజిక వర్గంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు బీజేపీ  సమన్వయ కమిటీ భేటీ ఇవాళ జరగబోతోంది.

మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశానికి బండి సంజయ్‌, ముఖ్య నేతలు  హాజరవుతారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు. ఎస్టీ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి.. వారిని బీజేపై వైపు ఆకర్షించే వ్యూహాలపైనా చర్చిస్తారు. సహజంగా ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు ఉంటుందన్న భావన ఉంది. దాన్ని పోగొట్టి అక్కడ కూడా బీజేపీ హవా తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: