ప‌ట్టాబి అన్న‌ది జ‌గ‌న్‌ను కాదు.. అయ్య‌న్న‌పాత్రుడు క్లారిటీ..!

N ANJANEYULU
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ తిట్టాడ‌ని అరెస్ట్ చేసి.. జైలుకు పంపిన విష‌యం విధిత‌మే. ఇవాళ దీనిపై టీడీపీ కీల‌క నేత అయ్య‌న్న‌పాత్రుడు ఓ క్లారిటీ ఇచ్చాడు.  సానుభూతి కోసం సీఎం జ‌గ‌న్ ఎంత‌టికైనా దిగ‌జారుతార‌ని ఎద్దేవా చేశారు. స‌జ్జ‌ల‌ను బోస డీకే అంటే.. సీఎం త‌న‌నే అన్నార‌ని.. ఆ ప‌దానికి పెడ‌ర్థాలు తీసి త‌ల్లి పేరుతో కొత్త‌సెంటిమెంట్ బ‌య‌టికీ తీశాడ‌ని జ‌గ‌న్‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. తెలంగాణ‌లో బోస డీకే అనే ప‌దానికి అర్థం "పాడైపోయిన" అని చెప్పారు.  


సీఎం జ‌గ‌న్‌కు నిజంగా త‌ల్లిమీద ప్రేమ ఉంటే.. తల్లిని బూతులు తిట్టిన వారికి అస‌లు మంత్రి ప‌ద‌వులే ఇవ్వ‌డ‌ని చుర‌క‌లంటించారు. త‌ల్లిని, చెల్లిని తెలంగాణ రోడ్ల‌పై అనాథ‌లుగా వ‌దిలేయ‌డ‌ని పేర్కొన్నారు. సీఎం జ‌గ‌న్ సింప‌తి వ‌స్తుందంటే త‌న మొహం మీద తానే ఉమ్మేసుకునే ర‌కం అని మండిప‌డ్డారు. ఓట్లు, సీట్లు వ‌స్తాయ‌ని తండ్రి, బాబాయ్ శ‌వాల ద‌గ్గ‌ర నుంచి కోడిక‌త్తి వ‌ర‌కు దేనిని వ‌ద‌లని జ‌గ‌న్ ఇప్పుడు ఈ ప‌దాన్ని వ‌దులుతాడా అని ఆరోపించారు మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: