నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ...లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం..?

N.V.Prasd
హైద‌రాబాద్‌ : తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగిస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.నేడు జ‌ర‌గ‌నున్న క్యాబినేట్ భేటీలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకంటార‌నేది స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంది.కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టగా.. లాక్‌డౌన్‌ ఎత్తేసి కర్ఫ్యూ విధిస్తారా..? లేకపోతే సడలింపులు ఇస్తారా? అనేది నేడు తెల‌నుంది.కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికి లాక్‌డౌన్ పొడిగించాలా లేదా అనే దానిపై ప్ర‌భుత్వం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతుంది.సీఎం కేసీఆర్‌  అధ్య‌క్ష‌త‌న మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రివ‌ర్గ సమావేశం జ‌ర‌గ‌నుంది.క‌రోనా నియంత్ర‌ణ‌,లాక్‌డౌన్‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.దీంతో పాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, విత్తనాలు-ఎరువుల లభ్యత, రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణపైనా మంత్రివర్గం చర్చించనుంది.లాక్‌డౌన్‌ అమలుతోనే క‌రోనా కంట్రోల్ అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ సెకండ్‌ విజృంభించిన మొదట్లో తెలంగాణలో రోజువారీ కేసులు 10 వేల మార్కును దాటాయి. ఇప్పుడు 90 వేల టెస్ట్‌లు చేస్తున్నా మూడు వేల లోపు కేసులు మాత్రమే వస్తున్నాయి. మరింత కంట్రోల్ చేసేందుకు ఇంకో వారం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్‌ అమలుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కూలీలు, చిరు వ్యాపారులు ఇక్కట్లు, 4 గంటల సడలింపుతో జనం రద్దీ వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే.. ఎలాంటి నిర్ణయం వస్తుందనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.కరోనా కట్టడిలో భాగంగా ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఒకసారి పొడిగించిన గడువు నేటితో ముగియనుంది. దీంతో మరోసారి పెంపుపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి లాక్‌డౌన్‌ మొదలైన 12వ తేదీకి రోజువారీ కరోనా కేసులు 8 వేలు ఉంటే, మరణాల సంఖ్య 55కు పైగా ఉంది. పది రోజులుగా 4 వేల లోపు కేసులు మాత్రమే వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడయితే 3 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య గణనీయంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: