జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పెరిగే టిప్స్....

Purushottham Vinay
చాలా మంది జుట్టు రాలే సమస్యతో చాలా తీవ్రంగా బాధపడుతూ వుంటారు. ఇక ఆ సమస్య తగ్గాలంటే ముందుగా అసలు ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ప్రయత్నించండి. అస్సలు చిరాకు, కోపం తగ్గించుకోండి. ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.కాబట్టి ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.ఇక ఉసిరి జుట్టుకి చాలా మంచిది.ఉసిరి పొడిని తలకు రాయడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఇందులో రిచ్ యాంటీ‌ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటాయి. ఇవి చుండ్రు, తల మంటను తగ్గిస్తాయి. వెంట్రుకల మొదళ్లు బలోపేతం అవుతాయి.ఇక వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ‌ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ‌లు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చుండ్రును నివరించడమే కాకుండా జుట్టు మొదళ్లను బలోపేతం చేస్తుంది. షాంపూతో తలంటుకున్న తర్వాత వేపాకుల మిశ్రమాన్ని తలకు రాయాలి. 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో ఇలా రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

జుట్టుకి సంబంధించిన సమస్యనైనా తీర్చే సామర్థ్యం బీట్‌రూట్‌కు ఉంది. పోషకాల లోపం వల్ల జుట్టు ఊడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కొద్దిగా వేడి చేసి తలకు రాయండి. ఆ తర్వాత మునివేళ్లతో తలను బాగా మర్దనా చేయండి. దీనివల్ల వెంటుకల కుదళ్లలో రక్త ప్రసరణ మెరుగవ్వుతుంది. వెంట్రుకల కుదళ్లు బలోపేతం అవుతాయి.వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేసే శక్తి గ్రీన్‌టీకి ఉంది. అంతేగాక వెంట్రుకల ఉత్పత్తికి సహకరిస్తుంది. గ్రీన్‌టీను మీ తలకు కండీషనర్‌లా రాసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.ఉల్లిలో ఉండే సల్ఫర్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. ఇందుక మీరు ఉల్లిపాయను జ్యూస్‌లా చేసి తలకు పట్టించాలి. మునివేళ్లతో తల మొత్తం మర్దనా చేయాలి.మీ జుట్టు తడిగా ఉండటానికి నార, పత్తి వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన టవల్ వాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: