మార్కెట్లో మరో సింపుల్ సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్?

Purushottham Vinay
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో జనాలకు అనుగుణంగా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల అవుతున్నాయి.ఇక తాజాగా చూడడానికి చాలా సింపుల్ గా కనిపించే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విడుదల అయింది. ఈ స్కూటర్ ఫీచర్స్ తెలిస్తే ఎవ్వరైనా ఖచ్చితంగా ఖచ్చితంగా వావ్ అనాల్సిందే.అంత అద్భుతంగా ఉన్నాయి దీని ఫీచర్స్.లెట్రిక్స్ కంపెనీ తాజాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.ఇక ఈ స్కూటర్ పేరు ఇసిటీ జిప్.ఈ మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఇది ఒక మిడ్ స్పీడ్ స్కూటర్.ఇందులో మొత్తం రెండు రకాల మోడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్ లో టాప్ స్పీడ్ వచ్చేసి 35 కిలోమీటర్లు ఉంటుంది.అదే మోడ్ 2లో అయితే గంటకు 45 కిలోమీటర్ల దాకా వెళ్ళవచ్చు. మోడ్ వన్ రేంజ్ లో 75 కిలోమీటర్ల దాకా వెళ్ళవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5 సెకండ్లలో సున్నా నుంచి 20 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకుంటుంది.


ఇక ఈ స్కూటర్ లో 2kWH బ్యాటరీ ఫిక్స్ చేసి ఉంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా అమర్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ 165MM ఉంది. ఈ స్కూటర్ ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి కేవలం 12 పైసలు ఖర్చు అవుతుంది. ఈ లెక్క ప్రకారం రూ.12 ఖర్చుతో 100 ఏకంగా కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.దీన్ని కేవలం ఐదు గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వైట్, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్ ఇంకా రెడ్ కలర్లలో అందుబాటులో ఉంది. ఇంకా ఈ స్కూటర్ కు మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆప్షనల్ బ్యాటరీ బ్యాక్ సెట్ కూడా మీరు ఇందులో పొందవచ్చు. ఈ స్కూటర్ లో హెవీ డ్యూటీ బీఎల్డీసీ ఫిక్స్ చేశారు.ఇక ఈ లెట్రిక్స్ ఇసిటీ జిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. రూ.1.15 లక్షలు గా ఉంది. ఈ స్కూటర్ కు ఈజీ లోన్ ఆప్షన్ కూడా ఉండడంతో ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ స్కూటర్ను కొనుగోలు చేయవచ్చు. ఇక పర్సనల్ కమర్షియల్ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది చాలా సింపుల్ గా అనువుగా ఉంటుందని లెట్రిక్స్ కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: