ప్రస్తుతం మార్కెట్లో టూ వీలర్ అమ్మకాలు ఆకాశాన్ని అంటుంటున్నాయి. ముఖ్యంగా స్కూటర్ల మార్కెట్ ధరలు అయితే తారా స్థాయిలో వున్నాయి. ఎక్స్ షో-రూమ్ రేట్లు రూ. 50 వేల నుంచి రూ. లక్ష దాకా వున్నాయి.మధ్యతరగతి ప్రజలు ఈ ధరలను తట్టుకోలేక ఎక్కువగా వారు సెకండ్ హ్యాండ్ బైక్‌ల వైపు ఆసక్తి చూపుతున్నారు.కానీ సెకండ్ హాండ్స్ బండ్లు కొనడం వల్ల అవి కొన్ని సంవత్సరాలకే రిపేర్లు వస్తున్నాయి. అందువల్ల మధ్య తరగతి ప్రేక్షకులు అటు క్వాలిటీ విషయంలో ఇంకా ధరల విషయంలో చాలా నష్టపోతూ ఉన్నారు.ఈ క్రమంలోనే అదిరిపోయే సూపర్ మైలేజ్ ఇంకా తక్కువ బడ్జెట్‌తో పలు బైక్ మోడల్స్ ఫేమస్ ఆన్‌లైన్ సెల్లింగ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే హీరో కంపెనీకి చెందిన మాస్ట్రో స్కూటర్ కేవలం రూ. 25 వేలకే అమ్మకానికి ఉంచింది ‘బైక్స్ 24’ వెబ్‌సైట్. మరి ఆ బైక్ కి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇక సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ‘బైక్స్ 24’ హీరో మాస్ట్రో(Hero Mastero) స్కూటర్‌ను కేవలం రూ. 25 వేలకే మంచి క్వాలిటీతో విక్రయానికి ఉంచింది. ఇక ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ 2019 సంవత్సరం మోడల్‌ది. మొత్తం 6600 కిలోమీటర్లు తిరిగిన ఈ వాహనాన్ని ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నాడు. ఇక ఈ స్కూటర్ లీటర్‌కు 53 కిలీమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇంకా అలాగే ఈ స్కూటర్‌పై ఏడాది వారంటీ,అలాగే ఏడు రోజుల మనీ క్యాష్‌బ్యాక్ గ్యారంటీ అనేది కూడా ఉంది. ఇక ఆలస్యం చెయ్యకుండా మీరు దీన్ని కోనేందుకు ట్రై చెయ్యండి. అయితే సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనేటప్పుడు బైక్ యజమానిని మీరు కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు మాత్రం చేయకండి.అన్ని తెలుసుకొని జాగ్రత్తగా కొనుగోలు చెయ్యండి.