స్కోడా కుషాక్ కొత్త ఎడిషన్.. పూర్తి వివరాలు?

Purushottham Vinay
స్కోడా  కుషాక్ SUV ఇండియన్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో దూసుకెళుతోనే ఉంది. అయితే కంపెనీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఇందులో కొత్త కొత్త అప్డేట్స్ తీసుకువస్తూనే ఉంది.ఇందులో భాగంగానే స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్‌ మరియు కుషాక్ ఎన్ఎస్ఆర్ వంటివి మార్కెట్లో విడుదలయ్యాయి. కాగా ఇప్పుడు ఇందులో నుంచి మరో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..కంపెనీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో 'కుషాక్ యానివెర్సరీ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 15.59 లక్షలు. ఇది ప్రస్తుతం స్టైల్ 1.0 ఇంకా స్టైల్ 1.5 అనే రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో స్టైల్ 1.0 ధర రూ. 15.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా స్టైల్ 1.5 ధర రూ. 19.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) వుంది.ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'కుషాక్ యానివర్సరీ ఎడిషన్' డిజైన్ ఇంకా ఫీచర్ చాలా వరకు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఎక్స్టీరియర్ కలర్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు.


కుషాక్ యానివర్సరీ ఎడిషన్ ఇప్పటికే మార్కెట్లో విడుదలైన కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్ మాదిరిగానే స్టీరింగ్ వీల్‌పై 'యానివర్సరీ ఎడిషన్' బ్యాడ్జ్, కొత్త డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్లు, కొత్త కాంట్రాస్ట్ స్టిచింగ్ ఇంకా క్రోమ్ అప్లిక్‌ వంటి వాటిని పొందుతుంది. అదే సమయంలో ఫ్రంట్ బంపర్, సన్‌రూఫ్ ఇంకా 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌పై ఫాక్స్ డిఫ్యూజర్ ఎలిమెంట్ పొందుతుంది.ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కి సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా అలాగే క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.కొత్త కుషాక్ యానివర్సరీ ఎడిషన్ టాప్-స్పెక్ స్టైల్ 1.0 ఇంకా 1.5 ట్రిమ్‌లపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇది 1.0-లీటర్, త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇంకా 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: