కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్లు అతలాకుతలం అయినా కార్ల అమ్మకాలు మాత్రం అసలు ఆగడం లేదు. దీంతో వ్యాపారంలో కార్ల విక్రయాలు చాలా రెట్టింపవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా డిమాండ్లకనుగుణంగా తయారు చేసేందుకు బాగా మొగ్గు చూపుతున్నాయి. ఎంత డిమాండ్లు పెరిగినా కూడా వాటికి సమానమైన ఉత్పత్తిని సాధించేందుకే కంపెనీలు టార్గెట్లు పెట్టుకుంటున్నాయి.ఇక దీంతో ప్రముఖ కంపెనీల వద్ద వినియోగదారుల డిమాండ్ల మేరకు ఉత్పత్తి చేసేందుకు కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీల వద్ద లక్షల్లో ఆర్డర్లు అనేవి ఉండటంతో వారికి డెలివరీ చేసేందుకు కంపెనీలు కూడా ఉత్పత్తిని చేపడుతున్నాయి. ప్రస్తుతం వివిధ కంపెనీల వద్ద ఉన్న ఆర్డర్లు మొత్తం కూడా 6,53,000 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని విపత్తులు వచ్చినా కూడా కార్ల డిమాండ్లు తగ్గడం లేదు. దీంతో ఉత్పత్తిలో కూడా వేగంని పెంచుతున్నాయి. ప్రముఖ కంపెనీల వద్ద ఆర్డర్లు భారీగా ఉండటంతో వారికి అందజేసేందుకు బాగా మొగ్గు చూపుతున్నాయి.ఇక మారుతి సుజుకి కంపెనీ వద్ద మొత్తం 3.22 లక్షల ఆర్డర్లు ఉన్నట్లు తెలుస్తోంది.రాబోయే రెండున్నర నెలల్లో వినియోగదారులకు డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది.
రోజు వారీ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు కూడా తీసుకుంటోంది. తరువాత హ్యుందాయ్ మోటార్ వెహికల్ కంపెనీ వద్ద మొత్తం 1.33 లక్షల యూనిట్లకు ఆర్డర్లు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే వీరికి డెలివరీ చేసేందుకు కంపెనీలు కూడా రెడీ అవుతున్నాయి. మహేంద్ర అండ్ మహేంద్ర వద్ద కూడా మొత్తం 1.46 లక్షల యూనిట్లకు ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఇంకా అలాగే బెంజ్ కంపెనీ కూడా తన వద్ద ఐదు వేల ఆర్డర్లు ఉన్నట్లు చెబుతోంది. ఖరీదైన కార్లు కావడంతో వీటికి కూడా డిమాండ్ చాలా ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఇంకా అలాగే ప్రపంచ వాహన మార్కెట్లో భారత్ స్థానం ఐదోది కావడం విశేషం. దీంతో కార్ల వినియోగంలో మనదేశం మంచి పురోగతి సాధిస్తోంది. అన్ని కంపెనీలు కూడా తమదైన శైలిలో రాణిస్తూ తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉత్పత్తి కూడా పెంచుతూ వినియోగదారుల ఆశలకు జీవం పోస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభించినా కార్ల ఉత్పత్తి మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నాయి.