సెలెరియో : ఫుల్ ట్యాంక్ చేస్తే వందల కిలోమీటర్లు పోవచ్చు!

Purushottham Vinay
ఇక పెట్రోలు ధర రూ.10 తగ్గినప్పటికీ, ఇంకా సామాన్యులకు అందుబాటులో లేని ధరలోనే ఉంది. ముఖ్యంగా కారులో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే పెట్రోల్ ఇప్పటికీ, భారంగా ఉంటుంది అనే చెప్పాలి.అయితే దేశంలోని అన్ని కార్ల కంటే కూడా ఎక్కువ మైలేజీనిచ్చే కారు కోసం చాలా మంది వాహన ప్రియులు ఇంటర్నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇక అలాంటివారికి మారుతి సుజుకి సెలెరియో చక్కటి పరిష్కారం అనే చెప్పాలి.ఎందుకంటే ఈ కారు ఒక లీటర్ పెట్రోల్‌ తో 26.68 కిమీ మైలేజీని ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, దీని cng వేరియంట్ మైలేజ్ వచ్చేసి 35.60 km/kgగా ఉంది. అంటే, ఈ కార్ cng వేరియంట్ మైలేజ్ కూడా అత్యధికం అనే చెప్పాలి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వచ్చేసి రూ. 5.25 లక్షలు. అంటే ఈ కారు నడిపే వ్యక్తులకు పెట్రోల్ వేరియంట్ ధరతో పెద్ద తేడా అనేది ఏమి ఉండదు.ఇక మారుతి సెలెరియోలో 32 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. అంటే, మీరు దానిని పూర్తిగా ట్యాంక్ చేస్తే, ఇక అప్పుడు 26.68 km / l లీటర్ ప్రకారం, మీరు 853Km ప్రయాణించగలరు.


అంటే హైదరాబాద్ నుంచి ముంబై వరకూ చాలా సులభంగా దారిలో పెట్రోల్ పోసుకోవాల్సిన అవసరం లేకుండా వెళ్లవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి ముంబై దూరం 712.1 km మాత్రమే అని గుర్తుంచుకోండి.ఇక కొత్త సెలెరియో కొత్త K10C DualJet 1.0-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఇది స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 66 హెచ్‌పి పవర్ ఇంకా 89 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే 2 హెచ్‌పి పవర్ ఇంకా 1 ఎన్ఎమ్ టార్క్ తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ఇంకా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దీని LXI వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంది.అలాగే దీని మైలేజ్ 26.68 kmpl అని కంపెనీ పేర్కొంది. ఇక ఇది ప్రస్తుత మోడల్ కంటే 23% ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: