ఇక స్టైలిష్ బైక్ అయిన కేటీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బైక్స్ చాలా స్టైలిష్ గా ఉండి యూత్ ని చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికీ స్పోర్ట్స్ బైక్ ని ఇష్టపడే యూత్ ఈ బైక్ నే ఫస్ట్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక ఈ బ్రాండ్‌లో ఆర్‌సీ 390 2022 మోడల్ బైక్‌ను బజాజ్ కంపెనీ సోమవారం నాడు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే భారత మార్కెట్లో కొనసాగుతున్న ఆర్‌సీ 390కే సరికొత్త మెరుగులుదిద్ది 2022 మోడల్‌గా తీసుకొచ్చింది బజాజ్ కంపెనీ.ఇక గత మోడల్స్‌తో కనుక పోల్చుకుంటే ఈ సరికొత్త ఆర్‌సీ 390లో అనేక కొత్త ఫీచర్స్‌ను యాడ్ చేసింది కేటీఎం. సింగిల్-పాడ్ LED హెడ్‌లైట్, నాణ్యమైన బాడీ గ్రాఫిక్స్, 13.7-లీటర్ సామర్ధ్యం గల ఇంధన ట్యాంక్ ఇంకా అలాగే సీట్ డిజైన్ కూడా కొత్త మోడల్‌లో మారింది. అలాగే వీటితో పాటుగా..బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, WP అభివృద్ధి చేసిన అప్‌సైడ్‌డౌన్ ఫోర్క్ ఇంకా అలాగే అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్ కూడా ఉన్నాయి.
అయితే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఉన్న అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఫీచర్ మాత్రం ఇండియా మోడల్స్‌కు లేదు.ఇంకా అలాగే 373CC లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఇంకా DOHC ఇంజిన్ ని కూడా కలిగి ఉంది. 2022 మోడల్ ఇంజిన్‌లో 40 శాతం పెద్ద ఎయిర్‌బాక్స్ ఇంకా అలాగే కొత్త ఇంజిన్ మ్యాపింగ్‌ను కూడా అభివృద్ధి చేశారు. దీంతో బైక్ టార్క్ అనేది కూడా పెరగడంతో పాటు మొత్తం రైడ్ క్వాలిటీని పెంచుతుందని కూడా కేటీఎం కంపెనీ తెలిపింది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో వస్తున్న ఆర్‌సీ 390 మాక్సిమం 42.9 bhp పవర్ ఇంకా 37 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. KTM ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ ఇంకా అలాగే KTM ఆరెంజ్ రంగుల్లో లభిస్తున్న ఈ ఆర్‌సీ 390 ధర వచ్చేసి రూ.3,14,000/- (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కేటీఎం తెలిపింది.ఖచ్చితంగా ఈ బైక్ యూత్ ని బాగా ఆకట్టుకొని పిచ్చెక్కించడం ఖాయం.ఖచ్చితంగా ఈ బైక్ మిగతా స్పోర్ట్స్ బైక్ లకి గట్టి పోటీని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.