ఇండియాలో విడుదలైన Lexus NX 350h.. ధర ఎంతంటే..?
ఇక ఈ కొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' అనేది పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో మనకు లభిస్తుంది. ఇది మార్కెట్లో మూడు వేరియంట్‌లలో మనకు లభిస్తుంది. అవి ఎక్స్‌క్విజిట్, లగ్జరీ ఇంకా అలాగే ఎఫ్-స్పోర్ట్ వేరియంట్స్. ఇక వీటి ధరల విషయానికి వస్తే..
Lexus NX
Exquisite ₹64,90,000
Luxury₹69,50,000
F-Sport ₹71,60,000
ఇక 2022 లెక్సస్ NX 350h అద్భుతమైన డిజైన్ ని పొందుతుంది. ఇది సింగిల్-పీస్ హెడ్‌ల్యాంప్‌లు ఇంకా అలాగే కొత్త బంపర్‌లు, పొడవాటి హుడ్ ఇంకా అలాగే కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్ వంటి వాటిని కూడా పొందుతుంది. అంతే కాకూండా కారు హుడ్ నుండి బంపర్ దాకా పెద్ద గ్రిల్ ఉంటుంది. అదే రేడియేటర్ గ్రిల్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే బూట్ డోర్‌పై 'లెక్సస్' బ్యాడ్జింగ్ కూడా మీరు చూడవచ్చు.
ఇక మొత్తానికి ఇది చూడగానే ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది.ఇక కొత్త Lexus NX 350h SUV కొలతల విషయానికి కనుక వస్తే, ఇది 4,661 మిమీ పొడవు, 1,865 మిమీ వెడల్పు, 1,661 మిమీ ఎత్తు ఇంకా అలాగే 2690 మిమీ వీల్‌బేస్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతి అనేది కూడా అందిస్తుంది.
ఇక ఇందులో 9.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ అనేది పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 14 ఇంచెస్ నావిగేషన్ సిస్టమ్ ఇంకా అలాగే 10-స్పీకర్ లెక్సస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అనేది కూడా పొందుతుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా అలాగే కొత్త స్టీరింగ్ వీల్ అనేది పొందుతుంది.