ఇండియన్ మార్కెట్లోకి Mercedes Maybach S-Class విడుదల..!!

Purushottham Vinay
ఫేమస్ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) నుంచి భారతీయ మార్కెట్లో కొత్త 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్' (Mercedes-Maybach S-Class) విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ ధర వచ్చేసి రూ. 2.50 కోట్లు. ఈ కార్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి S580 ఇంకా S680.మెర్సిడెస్ S580 మోడల్ అనేది స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది. అయితే S680 మోడల్ అనేది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి చేయబడుతుంది. S680 భారతదేశంలో అమ్మబడుతున్న అత్యంత ఖరీదైన మేబ్యాచ్ మోడల్. మేబ్యాక్ S-క్లాస్ అనేది దాని స్టాండర్డ్ ఎస్-క్లాస్ సెడాన్ కంటే కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్' ఎంతో అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ ముందు భాగంలో పెద్ద క్రోమ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ DRLలు ఇంకా అలాగే బంపర్‌లపై క్రోమ్ ఫినిషింగ్‌ను పొందుతుంది. కారు ప్రీమియం రూపాన్ని మెరుగుపరచడానికి విండోస్ ఇంకా అలాగే ORVMలపై క్రోమ్ లైనింగ్ ఉపయోగించబడింది. ఇందులో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అనేవి ఉన్నాయి.


ఇక మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,469 మిమీ, 1,921 మిమీ వెడల్పు, 1,510 మిమీ ఎత్తు ఇంకా అలాగే 3,396 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది, ఇది మునుపటి జనరేషన్ కంటే కూడా 31 మిమీ పొడవును అదనంగా పొందుతుంది.ఇక ఈ సెడాన్ బుకింగ్స్ ఇప్పటికే కంపెనీ స్టార్ట్ చెయ్యడం అనేది జరిగింది. అయితే 2023 వరకు అమ్మాల్సిన దాని అన్ని యూనిట్లు ఇప్పటికే పూర్తిగా అమ్మబడ్డాయి. ఇక ఈ మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ కంపెనీ S-క్లాస్ లైనప్‌లో అత్యంత ప్రీమియం సెడాన్. ఇది మరింత లెగ్‌రూమ్ కలిగి ఉండటమే కాకుండా ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.ఇక మొత్తం మీద ఇది ప్రీమియం ఫీచర్‌లతో అందించబడుతుంది. లేన్ అసిస్ట్ ఫీచర్‌తో పాటు లెవెల్-2 అటానమస్ డ్రైవింగ్ ఫంక్షన్‌ను కూడా కంపెనీ ఈ కార్లో అందించింది. ఈ కారులో బర్మీస్టర్ హై-ఎండ్ 4డి సరౌండ్ సౌండ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. క్యాబిన్‌ను నిశ్శబ్దంగా ఉంచడానికి ఈ కార్ అడ్జస్టబుల్ డంపింగ్ ADS+తో కూడిన ఎయిర్‌మేటిక్ ఎయిర్ సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇది పవర్‌ట్రెయిన్, ESP, సస్పెన్షన్ ఇంకా అలాగే స్టీరింగ్‌ను డైనమిక్ సెలెక్ట్ ద్వారా అడ్జస్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: